For Money

Business News

కొనండి… ఇపుడు కాదు

నిఫ్టి ఇవాళ అత్యంత కీలక మద్దతు స్థాయి, 200 రోజుల చలన సగటును కోల్పోనుంది. ఈ నేపథ్యంలో నిఫ్టి ఇపుడు కొనుగోలు చేయొద్దని.. ఆగమని సలహా ఇస్తున్న ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ సుదర్శన్‌ సుఖాని. నిఫ్టికి తుదపరి స్థాయి 16750 ప్రాంతంలో లభించవచ్చని… 16700-16750 మధ్య నిఫ్టిని కొనుగోలు చేయొచ్చని…అపుడు కూడా వంద పాయింట్ల స్టాప్‌లాస్‌తో కొనాల్సి ఉంటుందని ఆయన అన్నారు. నిఫ్టి పడే వరకు ఆగాలని ఆయన ఇన్వెస్టర్లను కోరారు. భారీ గ్యాప్‌ డౌన్‌తో నిఫ్టి ప్రారంభం అవుతున్నందున వెంటనే కొనడం లేదా అమ్మడం చేయొద్దని ఆయన సలహా ఇచ్చారు. కోఫోర్జ్‌ షేర్‌ను ఆయన ఇవాళ్టి ట్రేడింగ్‌ కొనుగోలు చేయొచ్చని సుదర్శన్‌ సుఖాని సలహా ఇచ్చారు.