For Money

Business News

నిరాశపర్చిన రిలయన్స్‌

సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రిలయన్స్‌ పనితీరు మార్కెట్‌ అంచనాలను అందుకోలేకపోయింది. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ. 2,31,886 కోట్ల టర్నోవర్‌పై రూ. 17,394 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఈటీ నౌ నిర్వహించిన సర్వేలో పాల్గొన్న అనలిస్టులు కంపెనీ రూ. 2,27,553 కోట్ల టర్నోవర్‌పై రూ. 17,841 కోట్ల నికర లాభాన్ని అంచనా వేశారు. అంటే టర్నోవర్‌ విషయంలో కంపెనీ పనితీరు బాగున్నా… నికర లాభం విషయంలో అంచనాలను తప్పింది. ఎబిటా మార్జిన్‌ 3.9 శాతం పెరిగి 17.5 శాతానికి చేరింది. ముఖ్యంగా రిలయన్స్‌ జియో విభాగం పనితీరు కూడా అంతంత మాత్రంగానే ఉంది. గడచని ఏడు త్రైమాసికంలో ఎన్నడూ లేనంత తక్కువ వృద్ధి రేటును జియో సాధించింది. గత త్రైమాసికంతో పోలిస్తే ఈ త్రైమాసికంతో పోలిస్తే జియో విభాగం టర్నోవర్‌ 3 శాతం పెరిగి రూ. 24,750 కోట్లకు చేరగా, నికర లాభం 4 శాతం లాభంతో రూ. 5,058 కోట్లకు చేరింది. ఎబిటా మార్జిన్‌ 52.3 శాతంగా నమోదైంది.