For Money

Business News

మూరత్‌ ట్రేడింగ్‌ టైమ్‌ ఇదే…

దీపావళి సందర్భంగా ఏటా మూరత్‌ ట్రేడింగ్‌ను స్టాక్‌ ఎక్స్ఛేంజీలు నిర్వహించడం సాధారణం. ఈ ఏడాది కూడా మూరత్‌ ట్రేడింగ్‌ను నవంబర్‌ 12వ తేదీన నిర్వహించనున్నట్లు బీఎస్‌ఈ వెల్లడించింది. ఆ రోజు ఎప్పటిలాగే సాయంత్ర ఆరు గంటల నుంచి 7.15 గంటల వరకు మూరత్‌ ట్రేడింగ్‌ సాగుతుంది. ప్రి మార్కెట్‌ ట్రేడింగ్ కూడా ఉంటుంది. పండుగ 12వ తేదీన అంటే ఆదివారం వస్తుంది కాబట్టి… ఆ రోజు సాధారణ ట్రేడింగ్‌ ఉండదు. 13వ తేదీన ట్రేడింగ్‌ జరిగినా.. ఆ మరుసటి రోజు అంటే నవంబర్‌ 14వ తేదీన బలిప్రతిపాద పండుగ సందర్భంగా మార్కెట్లకు సెలవు.