For Money

Business News

జియో ఐపీఓ ఈ ఏడాదే?

భారీ ఎత్తున విదేశాల నుంచి నిధులు సమీకరించిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఇపుడు కంపెనీలోని కీలక భాగాలను విడిదీసి లిస్టింగ్‌ చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. రిలయన్స్‌ జియోను విడగొట్టి క్యాపిటల్‌ మార్కెట్‌లో లిస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రముఖ బ్రోకరేజీ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ పేర్కొంది. ఇప్పటికే రిలయన్స్‌ జియోలో 33 శాతం వాటాలను ఇతర సంస్థలకు విక్రయించి రూ .1.52 లక్షల కోట్లను సమీకరించిన విషయం తెలిసిందే. 2020లో నిధుల సమీకరణలో భాగంగా 10 శాతం వాటాలను ఫేస్‌బుక్‌,, 8 శాతం గూగుల్‌కు కేటాయించింది. మరో 11 సంస్థలకు కూడా రిలయన్స్‌ వాటాలను అమ్మింది. దేశంలో అతి పెద్ద టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్‌గా ఉన్న జియోకి గత ఏడాది అక్టోబరు నాటికి 42.65 కోట్ల మంది సబ్‌స్క్రయిబర్స్‌ ఉన్నారు. జియో లిస్టింగ్‌ తరవాత ఈ రంగంలోకి ఇతర కంపెనీలైన ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ల వ్యాల్యూయేషన్‌లో మార్పు వచ్చే అవకాశముంది.