For Money

Business News

రిలయన్స్‌ జియో గ్రాస్ మార్జిన్‌ 49.2 శాతం

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు జియో, రీటైల్‌ కీలక విభాగాలుగా మారాయి. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో రిలయన్స్‌ జియో విభాగం రూ. 19,347 కోట్ల టర్నోవర్‌పై రూ. 3,615 కోట్ల నికర లాభం ఆర్జించింది. రెండో త్రైమాసికంలో ఇదే విభాగం రూ. 18,733 కోట్ల టర్నోవర్‌పై రూ. 3,528 కోట్ల నికర లాభం ప్రకటించింది. కంపెనీ మార్జిన్‌ 48 శాతం నుంచి 49.2 శాతానికి పెరగడం విశేషం. జియో ఫలితాలు మార్కెట్‌ విశ్లేషకుల అంచనాలను కూడా మించాయి. యావరేజ్‌ రెవెన్యూ పర్‌ యూజర్‌ రూ. 143.60 నుంచి రూ. 151.60కి పెరిగింది.

రీటైల్‌ విభాగం అదుర్స్‌

రిలయన్స్‌ రీటైల్‌ విభాగం పనితీరు కూడా మార్కెట్‌ అంచనాలను మించింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రీటైల్‌ విభాగం రూ. 57,717 కోట్ల టర్నోవర్‌పై రూ. 3,835 కోట్ ఎపిటా ఆర్జించింది. రెండో త్రైమాసికంతో పోలిస్తే టర్నోవర్‌ 27 శాతం, ఎబిటా 31 శాతం మేర పెరిగాయి. మార్జిన్‌ కూడా 0.2 శాతం పెరిగి 6.4 శాతం నుంచి 6.6 శాతానికి చేరింది.