For Money

Business News

క్రిప్టో కరెన్సీలు ఢమాల్‌

అమెరికా స్టాక్‌ మార్కెట్‌లో పతనం కొనసాగుతోంది. నాస్‌డాక్‌ వరుసగా నాలుగో రోజు కూడా నష్టాల్లో ట్రేడవుతోంది. అలాగే కరెన్సీ కూడా. బాండ్స్‌పై ఈల్డ్‌ పెరుగుతున్న నేపథ్యంలో క్రిప్టో కరెన్సీలలో కూడా అమ్మకాల ఒత్తిడి వస్తోంది. బిట్‌కాయిన్‌ ఇవాళ 10 శాతంపైగా క్షీణించి 38,425 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అలాగే ఎథేర్‌ కూడా 12 శాతం క్షీణించి 2,807 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.బీఎన్‌బీ కూడా పది శాతం నష్టపోయింది. డిసెంబర్‌ 26వ తేదీన 50,800 డాలర్లు ఉన్న బిట్‌ కాయిన్‌ కేవలం నెల రోజుల వ్యవధిలో 38000 డాలర్ల స్థాయికి పడిపోవడంతో… కొత్తగా ఈ మార్కెట్‌లో ప్రవేశించినవారు బాగా చేతులు కాల్చుకున్నారు.