For Money

Business News

పది గంటలకు వడ్డీ రేట్లపై ప్రకటన

ఇవాళ పదిగంటలకు ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ మీడియాతో మాట్లాడనున్నారు. మూడు రోజుల మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) భేటీ తరవాత ఆయన ఇవాళ వడ్డీ రేట్ల పెంపుపై కీలక ప్రకటన చేయనున్నారు. గత సమావేశాల్లో ప్రతిసారీ అర శాతం వడ్డీ రేట్లను పెంచిన ఆర్బీఐ ఈసారి మాత్రం 0.25 శాతం లేదా 0.35 శాతం మాత్రమే వడ్డీ రేట్లను పెంచవచ్చని పలువురు బ్యాంకర్లు అభిప్రాయపడుతున్నారు. ద్రవ్యోల్బణ ఒత్తిడి తగ్గిందని అభిప్రాయపడుతున్న ఆర్బీఐ.. ఇక వృద్ధిపై దృష్టి పెట్టే అవకాశముంది. మే నెలలో 0.4 శాతం వడ్డీని పెంచిన ఆర్బీఐ… తరవాత మూడు సమావేశాల్లో వరుసగా అరశాతం మేర పెంచింది. దీంతో మే నుంచి ఇప్పటి వరకు 1.9 శాతం మేర వడ్డీని పెంచింది.