For Money

Business News

భారీగా క్షీణించిన క్రూడ్‌ ఆయిల్‌

పెరిగిన ప్రతిసారీ క్రూడ్‌ ఆయిల్‌ ధరలపై తీవ్ర ఒత్తిడి వస్తోంది. ఇటీవల 88 డాలర్లకు చేరిన బ్రెంట్‌ క్రూడ్‌ ధర ఇవాళ 80 డాలర్లకు వచ్చేసింది. తాజా సమాచారం మేరకు క్రూడ్‌ ధర 80.66 డాలర్లు. డాలర్‌ కూడా తగ్గిన నేపథ్యంలో భారత్ వంటి మార్కెట్‌లో తక్కువ ధరకే క్రూడ్‌ లభించనుంది. నిన్న, ఇవాళ క్రూడ్ పడటానికి ప్రధాన కారణంగా రష్యా చమురుపై విధించిన ఆంక్షలు నిన్నటి నుంచి అమల్లోకి వచ్చాయి. జీ7 దేశాలు విధించిన షరతుల మేరకు రష్యా తన క్రూడ్‌ ఆయిల్‌ను బ్యారెల్‌ 60 డాలర్లకు మించి అమ్మడానికి వీల్లేదు. రష్యాకు భారీగా నిధులు సమకూరకుండా జీ7 దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. రష్యా నుంచి ఎవరైనా 60 డాలర్లకన్నా తక్కువకు కొనుగోలు చేస్తే,,, వాటికి బీమా ఇవ్వొద్దని… ఇన్సూరెన్స్‌ కంపెనీలపై ఆంక్షలు విధించాయి. దీంతో టర్కీ వద్ద వందల సంఖ్యలో ట్యాంకర్లు ఆగిపోయాయి. మరోవైపు రష్యా ఆయిల్ ధర 60 డాలర్లకు కావడంతో… అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గడం ప్రారంభమైంది. అయితే ఒపెక్‌ ఉత్పత్తిని తగ్గిస్తామని అంటున్నా… ప్రస్తుతానికి క్రూడ్‌పై ఒత్తిడి పెరుగుతూనే ఉంది.