For Money

Business News

మరో 11 ఎయిర్‌పోర్టులు ప్రైవేట్‌ చేతికి?

కోవిడ్‌ తరవాత పరిస్థితి సాధారణ స్థాయికి రావడంతో విమానాశ్రయాలను అమ్మే ప్రక్రియను కేంద్రం మళ్ళీ ప్రారంభించనుంది.మరో 11 విమానాశ్రయాలను ప్రైవేట్‌ కంపెనీలకు అప్పగించే ప్రక్రియను కేంద్రం ప్రారంభించనుంది. ఈసారి ప్రైవేటీకరించనున్న ఎయిర్‌పోర్ట్‌లలో కొన్ని లాభదాయకమైనవి కూడా ఉండటం విశేషం. ఫర్‌ సేల్‌ జాబితాలో ఉన్న ఎయిర్‌పోర్టులలో…వారణాసి, కాలికట్‌, పాట్నా, అమృత్‌సర్‌, భువనేశ్వర్‌, రాంచి, కోయంబత్తూర్‌, త్రిచి, ఇండోర్‌, రాయ్‌పూర్‌ కూడా ఉన్నాయి. వీటిలో లాభదాయకంగా ఉన్న భువనేశ్వర్‌, వారణాసి, ఇండోర్‌, త్రిచి, అమృత్‌సర్‌, రాయ్‌పూర్‌ ఎయిర్‌పోర్ట్‌లను అదానీ గ్రూప్‌నకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మీడియాలో వార్తలు వస్తున్నాయి ఒక కంపెనీకి రెండు మించి ఎయిర్‌పోర్టులు ఇవ్వరాదన్న కేంద్ర ఆర్థిక శాఖ సలహాలను కేంద్రం పక్కన బెట్టినట్లు ఆ పత్రిక రాసింది. ‘బిడ్డింగ్‌’ ప్రక్రియ తరవాత కీలక ఆరు ఎయిర్‌పోర్టులను అదానీకి అప్పగించడానికి వీలుగా నిబంధనలను ఎత్తివేస్తున్నట్లు గతంలో నేషనల్‌ హెరాల్డ్‌ పేర్కొంది. వాస్తవానికి ఈ ఎయిర్‌పోర్టుల ప్రైవేటీకరణకు 2019 చివర్లోనే కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అయితే కోవిడ్‌ కారణంగా ఈ ప్రక్రియ ఆగిపోయింది. ఇపుడు పరిస్థితి సాధారణ స్థాయికి రావడంతో కీలక ఎయిర్‌ పోర్టులను ప్రైవేట్‌ కంపెనీలకు బిడ్డింగ్‌ ద్వారా అప్పగించే ప్రక్రియ ప్రారంభం కానుంది.