For Money

Business News

నష్టాల్లో SGX NIFTY

అమెరికా ఈక్విటీ మార్కెట్లకు వడ్డీ రేట్ల భయం మళ్ళీ పట్టుకుంది. తాజాగా వెలువడుతున్న ఫైనాన్షియల్‌ డేటా మార్కెట్‌ను కలవరపెడుతోంది. పాజిటివ్‌గా ఉన్న ప్రతి డేటా మార్కెట్‌ను కంగారులో పడేస్తోంది. సర్వీస్‌ రంగ డేటా అద్భుతంగా ఉందని డేటా రావడంతో ఫెడ్‌ మళ్ళీ వడ్డీ రేట్లను పెంచతుందనే భయం మార్కెట్‌కు పట్టుకుంది. ఈ భయంతో మొదటి అమ్మకాల ఒత్తిడి పెరిగేది ఐటీ, టెక్‌ షేర్లపై. నిన్న రాత్రి మళ్ళీ నాస్‌డాక్‌ రెండు శాతం క్షీణించింది. అంతకుమందుఉ నాస్‌డాక్‌ మరింత క్షీణించి 11000 దిగువకు పడింది. కాని చివర్లో స్వల్పంగా కోలుకుని 11,013 వద్ద ముగిసింది. అలాగే ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ కూడా 1.44 శాతం క్షీణించడంతో.. ఈ సూచీకి అత్యంత కీలక స్థాయి 4000 పోయింది. ఇక డౌజోన్స్‌ కూడా ఒక శాతంపైగా క్షీణించి 34,000 స్థాయికి దిగువన క్లోజైంది. ఇలా అన్ని రకాల కీలక స్థాయిలను అమెరికా మార్కెట్లు కోల్పోతున్నాయి. ఏ క్షణమైనా మద్దతు వస్తుందనే ఆశతో ఇన్వెస్టర్లు ఉన్నారు. మరోవైపు తైవాన్‌ తప్ప మిగిలిన ఆసియా మార్కెట్లన్నీ రెడ్‌లో ఉన్నాయి అయితే నష్టాలన్నీ అర శాతంలోపు ఉండటం కాస్త ఉపశమనం కల్గించే అంశం. అయితే ఆస్ట్రేలియా సూచీ ఒక శాతం దాకా నష్టపోయింది. ఈ నేపథ్యంలో 21 పాయింట్ల నష్టతో ట్రేడవుతోంది. సో… నిఫ్టి ఇవాళ స్థిరంగా ప్రారంభం కానుంది.