For Money

Business News

ఏడాది కనిష్ఠానికి క్రూడ్‌ ఆయిల్‌

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు 12 నెలల కనిష్ఠానికి క్షీణించాయి. 126 డాలర్ల నుంచి 79 డాలర్లకు క్షీణించడం విశేషం. అంతర్జాతీయ మార్కెట్లలో వృద్ధి రేటుకు సంబంధించి భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. వచ్చే నెల అంటే జనవరి నుంచి మాంద్యం ప్రభావం కన్పిస్తుందని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇన్నాళ్ళూ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను పెంచుతూ వచ్చిందని.. దీని ప్రభావం వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో స్పష్టంగా కన్పిస్తుందని వీరు అంటున్నారు. ద్రవ్యోల్బణం ఇదే స్థాయిలో కొనసాగే పక్షంలో 2023లో మాంద్యం ఖాయమని పలు అమెరికా బ్యాంకులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముడి చమురు ఉత్పత్తిని కట్టడం చేస్తామని ఒపెక్‌ దేశాలు బెదిరిస్తున్నా… అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ధరలు తగ్గుతూనే ఉన్నాయి. అమెరికా మార్కెట్‌లో WTI క్రూడ్‌ బ్యారల్‌ ధర రాత్రి 74 డాలర్లకు పడిపోయింది. అలాగే బ్రెంట్‌ క్రూడ్‌ 79.63 డాలర్లకు పడపోయింది. ఇది ఏడాది కనిష్ఠ స్థాయి. వచ్చే బోర్డు సమావేశంలో ఫెడరల్‌ రిజర్వ్‌ మళ్ళీ కనీసం అర శాతం మేర వడ్డీ రేట్లను పెంచతుందని భావిస్తున్నారు. చైనాలో కరోనా తగ్గుముఖం పట్టిందని అంటున్నా… వాటికన్నా మాంద్యం భయాలే ఆయిల్‌ మార్కెట్‌ను కలవరపరుస్తోంది.