For Money

Business News

LEVELS: పడితే కొనొచ్చు కాని..

రాత్రి అమెరికా మార్కెట్లు భారీగా నష్టపోయినా.. మన మార్కెట్లు దాదాపు స్థిరంగా ప్రారంభం కానున్నాయి. నిఫ్టి క్రితం ముగింపు 18642. నిఫ్టి గత కొన్ని రోజుల్లో 18,600 స్థాయిని కాపాడుకుంటోంది. ఇవాళ ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచే అవకాశముంది. మార్కెట్‌ ట్రెండ్‌ పది గంటల తరవాత స్పష్టం కానుంది. వడ్డీ రేట్లతో పాటు ఆర్బీఐ కామెంటరీ కూడా ఇవాళ కీలకం కానుంది. నిఫ్టిలో చురుగ్గా ట్రేడ్‌ చేసేవారు 18550 స్టాప్‌లాస్‌తో నిఫ్టిని కొనుగోలు చేయొచ్చని… పొజిషనల్‌ ట్రేడర్స్‌ 18450 స్థాయిని స్టాప్‌లాస్‌గా పెట్టుకోవచ్చని సీఎన్‌బీసీ టీవీ 18 ఛానల్‌ మేనేజింగ్ ఎడిటర్‌ అనూజ్‌ సింఘాల్‌ సూచిస్తున్నారు. నిఫ్టికి 18600 పుట్‌ రైటింగ్‌, 18800 వద్ద కాల్‌ రైటింగ్ జోరుగా ఉన్నందున… ఈ స్థాయిల మధ్య నిఫ్టి కదలాడే అవకాశముంది. అమెరికా మార్కెట్లు భారీగా క్షీణించిన నేపథ్యంలో… ఏ క్షణమైనా ర్యాలీ రావొచ్చని ఆయన అంటున్నారు. నిఫ్టి కీలక మద్దతు స్థాయిలను చూసి ట్రేడ్‌ చేయాలని ఆయన సూచించారు. 18557 దిగువకు నిఫ్టి వెళితే 18501ని తాకే అవకాశముందని టెక్నికల్‌ అనలిస్టులు అంటున్నారు. ఈ స్థాయికి చేరితే బేర్‌ మూమెంట్‌ మొదలైనట్లేనని వీరు భావిస్తున్నారు. అయితే నిఫ్టి ఆ స్థాయికి వెళుతుందా లేదా అన్నది చూడాలి.