For Money

Business News

ఐపీఓకు కాన్‌కర్డ్‌ బయోటెక్‌

అహ్మదాబాద్‌కు చెందిన కాన్‌కర్డ్‌ బయోటెక్‌ కంపెనీ పబ్లిక్‌ ఇష్యూకు రానుంది. ఈ మేరకు స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబి వద్ద ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఈ కంపెనీ రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలాకు చెందిన రేర్‌ ఎంటర్‌ప్రైజస్‌కు 24 శాతం వాటా ఉంది. ఈ కంపెనీ ప్రమోటర్లలో ఒకటైన అయిన క్వాడ్రియా క్యాపిటల్‌ ఈ పబ్లిక్‌ ఇష్యూ ద్వారా కంపెనీ నుంచి వైదొలగనుంది. అంటే తన వాటాను అమ్మనుంది. వాస్తవానికి ఈ పబ్లిక్‌ ఆఫర్‌ కేవలం కాన్‌కార్డ్‌ తన షేర్లను అమ్మడానికి ఉద్దేశించినది.. ఈ ఆఫర్‌ కింద 2.093 కోట్ల షేర్లను ఆఫర్‌ చేయనుంది. ఆఫర్‌ ధర తెలియలేదు. 2016లో ఈ బయోఫార్మా కంపెనీలో ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ అయిన క్వాడ్రియా క్యాపిటల్‌ రూ. 475 కోట్లను ఇన్వెస్ట్‌ చేసింది.