For Money

Business News

17850పైన నిఫ్టి

సింగపూర్ నిఫ్టి స్థాయిలోనే నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 17869ని తాకిన నిఫ్టి ఇపుడు 17850 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 25 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. దాదాపు అన్ని సూచీలు గ్రీన్‌లో ఉన్నాయి. అదానీ గ్రూప్‌నకు చెందిన దాదాపు అన్ని షేర్లు ఇవాళ గ్రీన్‌లో ఉన్నాయి. ఇక సూచీల విషయానికొస్తే నిఫ్టిలో 40 షేర్లు లాభాల్లో ఉన్నాయి. సూచీల్లో నిఫ్టి మిడ్‌ క్యాప్‌ అర శాతం లాభపడింది. నిఫ్టి బ్యాంక్‌ సూచీలో పెద్దగా మార్పు లేదు. హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్‌లో ఒత్తిడి కన్పిస్తోంది. నిన్న ఈ గ్రూప్‌ షేర్లన్నీ వెలుగులో ఉన్న విషయం తెలిసిందే. ఇవాళ రిలయన్స్‌ కూడా గ్రీన్‌లో ఉంది. మీడియా షేర్లు వెలుగులో ఉన్నాయి. గత కొంతకాలంలో మీడియా రంగానికి చెందిన అనేక షేర్లు భారీ లాభాలతో ట్రేడవుతున్నాయి. నిఫ్టి విషయానికొస్తే ఎన్‌టీపీసీ 1.5 శాతం లాభంతో ఉంది. క్రూడ్‌ ధరలు తగ్గుతున్నందున ఏషియన్‌ పెయింట్స్‌ లాభాల్లో ఉంది. దాదాపు అన్ని పెయింట్ కంపెనీల షేర్లకు డిమాండ్‌ లభిస్తోంది. వేదాంత నిఫ్టి నెక్ట్స్‌లో టాప్‌లో ఉంది. లారస్‌ ల్యాబ్‌ మెలమెల్లగా పెరుగుతూ ఉంది. ఫలితాల రోజున కాస్త ఒత్తిడికి లోనైన ఈ షేర్‌.. క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఇవాళ రూ. 851 వద్ద ట్రేడవుతోంది. స్థానిక షేర్లలో దివీస్‌ ల్యాబ్‌ స్వల్ప లాభాల్లో ఉంది. రెయిన్‌బో హాస్పిటల్స్‌కు రూ. 600 వద్ద కాస్త ఒత్తిడి ఎదురవుతోంది.