For Money

Business News

అంచనాలను మించిన టీసీఎస్‌ పనితీరు

భారత దేశపు అతి పెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్‌ మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో అద్భుత పనితీరు కనబర్చింది. మార్కెట్‌ అంచనాలను మించింది. గత ఏడాదితో పోలిస్తే కంపెనీ కన్సాలిడేటెడ్‌ నికర లాభం 7.4 శాతం పెరిగి రూ.9,926 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ నికరలాభం రూ. 9,246 కోట్లు. ఈటీ నౌ ఛానల్‌ నిర్వహించిన పోల్‌లో కంపెనీ రూ. 9890 కోట్ల నికర లాభం ఆర్జిస్తుందని మెజారిటీ అనలిస్టులు అభిప్రాయపడ్డారు. అలాగే కంపెనీ టర్నోవర్‌ కూడా రూ. 50,070 కోట్లు ఉంటుందని వారు అంచాన వేయగా, కంపెనీ అంతకుమించి టర్నోవర్‌ ప్రకటించింది. నాలుగో త్రైమాసికంలో టీసీఎస్‌ రూ. 50,591 కోట్ల టర్నోవర్‌ సాధించింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ టర్నోవర్‌ రూ.43,705 కోట్లతో పోలిస్తే … ఆదాయం 15.75 శాతం పెరిగింది. కంపెనీ చరిత్రలో తొలిసారి ఓ త్రైమాసికంలో కంపెనీ టర్నోవర్‌ రూ.50,000 కోట్లను దాటగా, నికర లాభం రూ. 10,000 కోట్లకు దగ్గరగా వచ్చింది.