For Money

Business News

గత ఏడాదిలో లక్ష మందిని తీసుకున్నాం

గత ఆర్థిక సంవత్సరం అంటే 2021-22లో లక్ష మంది కొత్త ఉద్యోగులను తీసుకున్నట్లు టీసీఎస్‌ ఇవాళ ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో అంటే 2022-23లో మరో 40,000 మందిని తీసుకుంటామని పేర్కొంది. అయినా కంపెనీ నుంచి చాలా మంది వెళ్ళిపోతున్నారని.. దీనిపై తాము దృష్టి పెట్టామని కంపెనీ తెలిపింది. మార్చితో ముగిసిన త్రైమాసికపు ఫలితాలను కంపెనీ ఇవాళ ప్రకటించింది. ఇదే సమయంలో కంపెనీల ఉద్యోగుల వివరాలను తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా లక్ష మంది ఉద్యోగులను తీసుకోగా, వారిలో 78000 మంది ఫ్రెషర్స్‌ అని పేర్కొంది. ఈ త్రైమాసికంలో కంపెనీ వొదిలి పోతన్నవారి శాతం (attrition rate) 17.4 శాతమని టీసీఎస్‌ పేర్కొంది. టీసీఎస్‌లో ఇపుడు 5,92,195 మంది ఉద్యోగులు ఉన్నారు. ఫ్రెషర్స్‌ను తీసుకుంటున్నా కంపెనీకి ఉద్యోగుల కొరత తప్పదని షేర్‌ బ్రోకింగ్‌ సంస్థలు అంటున్నాయి.