For Money

Business News

17,700 దిగువన ముగిసిన నిఫ్టి

నిఫ్టి ఇవాళ పెరిగినపుడల్లా ఒత్తిడికి గురైంది. మిడ్‌ సెషన్‌ తరవాత కోలుకున్నా…చివర్లో వచ్చిన అమ్మకాల ఒత్తిడి కారణంగా నిఫ్టి భారీ నష్టాలతో ముగిసింది. ఇవాళ మొత్తం అయిదు సార్లు పెరిగేందుకు ప్రయత్నించింది.17,779ని తాకిన నిఫ్టి చివర్లో 17650ని తాకింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 109 పాయింట్ల నష్టంతో 17,674 పాయింట్ల వద్ద (తాత్కాలిక) ముగిసింది. హెచ్‌డీఎఫ్‌సీ విలీనం స్టాక్‌ ఇన్వెస్టర్లకు జోక్‌లా మారింది. ప్రకటించిన తేదీ నాటి ధరకన్నా దిగువకు షేర్‌ పడింది. ఇవాళ నిఫ్టి నెక్ట్స్‌, నిఫ్టి మిడ్‌ క్యాప్‌ లాభాల్లో ఉన్నా… నిఫ్టి, నిఫ్టి బ్యాంక్‌ నష్టాలతో ముగిశాయి. ఉదయం లాభాల్లో ఉన్న అనేక కంపెనీలు నష్టాల్లోకి జారుకున్నాయి. హెచ్‌సీఎల్‌ ఇన్ఫోటెక్‌, ఇన్ఫోసిస్‌, విప్రో షేర్లు నిఫ్టి టాప్‌ లూజర్స్‌లో ఉన్నాయి. ఇవాళ ఫలితాలు ప్రకటించనున్న టీసీఎస్‌ లాభాల్లో ముగిసింది.