For Money

Business News

బియ్యం ధరలకు రెక్కలు

రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం కారణం ఇప్పటి వరకు వంటనూనెలు, ఖనిజాలు, గోధుమలు, మొక్కజొన్న దరలు పెరిగాయి. ఇపుడు బియ్యం వంతు వచ్చింది. పౌల్ట్రీతోపాటు ఇతర పరిశ్రమల్లో గోధుమ, మొక్కజొన్న విరివిగా వినియోగిస్తారు. వీటి ధరలు ఇటీవల భారీగా పెరిగాయి. గోధమ, మొక్కజొన్నతో పాటు సన్‌ ఫ్లవర్‌ ఆయిల్ భారీగా పండించే ఉక్రెయిన్‌ ఇపుడు యుద్ధంలో చిక్కుకుంది. అలాగే నల్లసముద్రం ద్వారా రవాణా చాలా కష్టంగా మారింది. దీంతో పొరుగు దేశాల నుంచి వీటిని సమకూర్చకోవడానికి పలు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. అలాగే గోధుమ, మొక్క జొన్న ధరలు బాగా పెరగడంతో 5శాతం నూకలు ఉన్న బియ్యానికి ఇపుడు డిమాండ్‌ పెరిగింది. గత వారం థాయ్‌ల్యాండ్‌కు చెందిన 5 శాతం నూకలు ఉన్న బియ్యం ధర టన్నుకు 400 డాలర్లు ఉండగా, ఇపుడు 428 డాలర్లు పలుకుతోంది. ఇదే రకం బియ్యం మన దగ్గర గత వారం 370 డాలర్ల నుంచి 378 డాలర్లకు పెరిగింది. హాంగ్‌కాంగ్‌ వంటి దేశాల్లో జనం బియ్యం కొని స్టక్‌ పెట్టుకుంటున్నారు. దీంతో బియ్యం డిమాండ్‌ పెరుగుతోంది. కొన్ని దేశాలు కూడా స్టాక్‌ ఉంచుకునేందుకు ప్రయత్నించడంతో బియ్యానికి డిమాండ్‌ వస్తోంది.బంగ్లాదేశ్‌లో ఈసారి దిగుబడి బాగా పెరగనుంది. అలాగే నిల్వలు కూడా భారీగా ఉన్నాయి. అయినా డిమాండ్‌ వస్తోంది. దీంతో మున్ముందు బియ్యం ధరలు పెరగకపోయినా.. తగ్గే ప్రసక్తి లేదని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.