For Money

Business News

EPF: రూ.6,600 కోట్ల వడ్డీ కట్‌!

ఈపీఎఫ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను అనూహ్యంగా 8.5 శాతం నుంచి 8.1 శాతానికి తగ్గించాలని కేంద్రం నిర్ణయించడం… ఉద్యోగ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. మార్కెట్‌లో వడ్డీ రేట్లు పెరుగుతున్న సమయంలో తమ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించడం ఉద్యోగులను షాక్‌కు గురి చేసింది. రాష్ట్రా ప్రభుత్వాలే ఇపుడు 7.7 శాతంపైగా వడ్డీకి రుణం తెచ్చుకుంటున్న నేపథ్యంలో… ఉద్యోగులకు కేవలం 8.1 శాతం వడ్డీ ఇవ్వడం వెనుక కారణాలను ఉద్యోగ సంఘాల నేతలు లెక్కిస్తున్నారు. రుణ సాధానాలపై వడ్డీ రేట్లు బాగానే ఉన్నాయి… ఈక్విటీ మార్కెట్లు కూడా మంచి ఫలితాలు ఇస్తున్నాయి. ఇలాంటి సమయంలో వడ్డీ రేట్లను ఎందుకు తగ్గిస్తున్నారని వీరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వడ్డీ రేటు 8.5 శాతం నుంచి 8.1 శాతానికి తగ్గించడమంటే… ఉద్యోగులు సుమారు రూ. 6,600 కోట్ల మేర వడ్డీని కోల్పోయినట్లే. ప్రస్తుతం ఈపీఎఫ్‌ఓ ఆధ్వర్యంలో రూ. 16.6 లక్షల కోట్ల నిధులు ఉన్నాయి. ఇందులో 85 శాతం నిధులను రుణ సాధనాల్లో పెట్టుబడి పెడుతుండగా,15 శాతం ఈటీఎఫ్‌ల ద్వారా ఈక్విటీ మార్కెట్లలో ఉంచుతున్నారు. ఈ రెండు మార్గాల వచ్చే ప్రతిఫలాలను బట్టి వడ్డీని నిర్ణయిస్తారు. ఇపుడు ఇస్తున్నట్లు 8.5 శాతం వడ్డీ ఇవ్వాలంటే రూ. 1.41 లక్షల కోట్లు అవసరం. అదే 8.1 శాతానికి వడ్డీని తగ్గిస్తే రూ.1.34 లక్షల కోట్లు చెల్లిస్తే సరిపోతుంది. దీని వల్ల ఉద్యోగులకు చెల్లించాల్సిన వడ్డీ భారం రూ. 6,600 కోట్లు తగ్గుతుంది. అంటే ఉద్యోగులు ఆ మేరకు వడ్డీ పోయినట్లే.