For Money

Business News

ఈపీఎఫ్‌పై వడ్డీ భారీగా తగ్గింపు

2021-22 ఆర్థిక సంవత్సరానికి ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్‌)పై వడ్డీని తగ్గించాలని ఈపీఎఫ్‌ఓ నిర్ణయించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ నిధులపై 8.1 శాతం వడ్డీ ఇవ్వాలని నిర్ణయించారు. ఈపీఎఫ్‌పై ఈ స్థాయికి వడ్డీ రేటు పడిపోవడం 45 ఏళ్ళ తరవాత ఇదే మొదటిసారి. ఈపీఎఫ్‌ఓకు చెందిన సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ ఇవాళ సమావేశమై వడ్డీ రేట్లను తగ్గించాలని నిర్ణయించింది. ఇక ఆర్థిక శాఖ తుది నిర్ణయం తీసుకోవడమే తరువాయి. కొత్త రేట్లు అమల్లోకి వస్తాయి.2020-21లో ఈపీఎఫ్‌పై 8.5 శాతం వడ్డీ ఇచ్చారు. 1977-78లో ఈపీఎఫ్‌పై 8 శాతం వడ్డీ ఇచ్చారు. తరవాత ఆ స్థాయికి పడిపోవడం ఇదే మొదటిసారి. ఈపీఎఫ్‌లో తక్కువ జీతం వచ్చేవారికి ప్రభుత్వం కొన్ని ప్రోత్సాహకాలు ఇచ్చింది. ఆ మాత్రానికే మొత్తం ఈపీఎఫ్‌ దారులకు ఇచ్చే వడ్డీపై కోత పెట్టింది.
అపుడు అత్యధిక రేటు
1952లో ఈపీఎఫ్‌ ప్రారంభించారు. అపుడు మూడు శాతం వడ్డీ ఇచ్చారు. తరవాత 1989 నుంచి 1999 వరకు ఎన్నడూ లేనంతగా 12 శాతం వడ్డీ ఇచ్చారు. తరవాత ఎపుడూ పది శాతం కూడా చేరలేదు. అక్కడి నుంచి తగ్గుతూ వచ్చి 2018-19లో 8.65 శాతం, 2019-20, 2020-21లో 8.5 శాతం ఇచ్చారు.గడచిన 7 ఏళ్ళలో 8.5 శాతం లేదా అంతకన్నా తక్కువగా ఉంది.