For Money

Business News

పే కమిషన్లకు స్వస్తి… కొత్త విధానం త్వరలో!

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఏడవ పే కమిషన్‌ సిఫారసుల ప్రకారం జీతాలు, పెన్షన్లు అందుతున్నాయి. ఇలా కమిషన్‌ సిఫారసుల ద్వారా జీతాలు నిర్ణయించడం ఇదే ఆఖరిసారి అని.. ఇక నుంచి పే కమిషన్లు ఉండవని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంటే 8వ పే కమిషన్‌ను నియమించడం ఉండదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు అంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక నుంచి ఉద్యోగుల పనితీరును బట్టి జీతం పెరిగేలా కొత్త ఫార్ములాను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ఈ ఫార్ములాపై ఇంకా కసరత్తు జరుగుతోందని, సమీప భవిష్యత్తులో ఈ ఫార్ములా వివరాలు బహిర్గతం కావొచ్చిన మీడియా అంటోంది.2016 జులైలోనే అప్పటి ఆర్థిక మంత్రి ఇదే అంశాన్ని పార్లమెంటులో చెప్పారు. ఉద్యోగి పే కమిషన్‌ కోసం ఎదురు చూసే పరిస్థితి పోవాలని… ఉద్యోగుల పనితీరు చూసి జీతం ఇచ్చే పరిస్థితి రావాలని అప్పట్లో అన్నారు. డీఏ 50 శాతం అవగానే జీతం ఆటోమేటిగ్గా పెరిగేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. దీన్నే ఆటోమేటిక్‌ పే రివిజన్‌ అని అంటున్నారు. దీనివల్ల దిగువ, మధ్య తరగతి ఉద్యోగులకు అధిక ప్రయోజనం కల్గుతుందని భావిస్తున్నారు.