For Money

Business News

హైదరాబాద్‌లో స్విగ్గి జినీ నిలిపివేత

ముంబై, హైదరాబాద్‌, బెంగళూరు నగరాల్లో స్విగ్గీ జినీ సర్వీసును తాత్కాలికంగా ఆపేస్తున్నట్లు స్విగ్గీ వెల్లడించింది. ఐపీఎల్ క్రికెట్‌, పండుగల కారణంగా ఆర్డర్లు బాగా పెరిగాయని, ఉద్యోగులపై ఒత్తిడి పెరిగిందని కంపెనీ పేర్కొంది. త్వరలోనే మళ్ళీ ఈ మూడు నగరాల్లో స్విగ్గి జినీ ప్రారంభిస్తామని కంపెనీ పేర్కొంది. అలాగే ఢిల్లీ ఎన్‌సీఆర్‌, ముంబై, పుణె, హైదరాబాద్‌, చెన్నైలలో సూపర్‌ డైలీ సేవలను కూడా నిలిపివేస్తున్నట్లు స్విగ్గి తెలిపింది. ఈ విభాగం కార్యకలాపాలను పునర్‌ వ్యవస్థీకరిస్తున్నామని… దీంతో నిలిపివేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. నిర్వహణ ఒత్తిడి ప్రధాన కారణంగా తెలుస్తోంది. బెంగళూరు నగరంలో మాత్రం సూపర్‌ డైలీ సేవలుకొనసాగుతాయని పేర్కొంది.