For Money

Business News

ఆసియా మార్కెట్లకు వాల్‌స్ట్రీట్‌ దెబ్బ

అంతర్జాతీయంగా స్టాక్‌ మార్కెట్లకు మళ్ళీ ఒమైక్రాన్‌ భయం పట్టుకుంది. పైగా ఈ వారం సమావేశం కానున్న అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ ఉద్దీపన ప్యాకేజీ, వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయం కోసం మార్కెట్లు ఎదురు చూస్తున్నాయి. రాత్రి అమెరికా మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ఎప్పటిలాగే ఐటీ, టెక్ షేర్లలో అమ్మకాల జోరు కొనసాగుతోంది. ఎస్‌ అండ్‌ పీ 500 సూచీతో పాటు నాస్‌డాక్‌ భారీ నష్టాలతో క్లోజ్‌ కావడానికి కారణం ఇదే. నాస్‌డాక్‌ సూచీ ఏకంగా 1.4 శాతం క్షీణించింది. ఇతర సూచీలు కూడా సుమారు ఒక శాతం వరకు పడ్డాయి. దీంతో ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. కీలక మార్కెట్లయిన జపాన్, చైనా సూచీలు అరశాతం నష్టంతో ట్రేడవుతుండగా, హాంగ్‌సెంగ్‌ సూచీ మాత్రం 1.17 శాతం నష్టంతో ట్రేడవుతోంది. ఒమైక్రాన్‌ భయంతో క్రూడ్‌ ఆయిల్ స్వల్పంగా క్షీణించింది. సింగపూర్ నిఫ్టి 170 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. నిఫ్టి కూడా ఒక మోస్తరు నష్టాలతో ప్రారంభం కానుంది.