For Money

Business News

స్వల్ప నష్టాలతో నిఫ్టి

ఓపెనింగ్‌లో భారీగా నష్టపోయినట్లు కన్పించినా.. కొన్ని క్షణాల్లోనే నిఫ్టి కోలుకుంది. ఆరంభంలో18365ని తాకిన నిఫ్టి కొన్ని సెకన్లు మాత్రమే ఆ స్థాయిలో ఉంది. వెంటనే కోలుకుని ఇపుడు 18479 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 33 పాయింట్ల నష్టంతో ఉంది. నిఫ్టితో పాటు బ్యాంక్‌ నిఫ్టి నష్టాల్లోఉంది. అయితే నిఫ్టి నెక్ట్స్‌, నిఫ్టి మిడ్‌ క్యాప్‌ సూచీలు మాత్రం లాభాల్లో ఉన్నాయి. నిఫ్టిలో 26 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఊహించినట్లే మెటల్స్‌ నష్టాల్లో ఉన్నాయి. హిందాల్కో 1.6 శాతం నష్టంతో నిఫ్టి టాప్‌ లూజర్‌గా ఉంది. 15 ఏళ్ళు దాటిన వాహనాలను రోడ్లపై నుంచి తొలగించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేయడంతో పాటు…ఈ త్రైమాసికంలో ఆటో సేల్స్‌ బాగుంటాయన్న వార్తలతో ఆటోషేర్లు ఇవాళ నిఫ్టి టాప్‌ గెయినర్స్‌లో ఉన్నాయి. హీరో మోటోకార్ప్‌ రెండు శాతంపైగా లాభంతో ఉంది. ఇక నిఫ్టి నెక్ట్స్‌లో మళ్ళీ పేటీఎం టాప్‌ లూజర్‌గా నిలిచింది. ఈ షేర్‌ 1.76 శాతం నష్టంతో రూ.457 వద్ద ట్రేడవుతోంది. అలాగే వేదాంత, నైకా షేర్లు ఒక శాతంపైగా నష్టంతో ఉన్నాయి. దాదాపు అన్ని ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు గ్రీన్‌లో ఉన్నాయి. మెటల్స్‌ నష్టాల్లో ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ రూ.1600 వద్ద గట్టి ఒత్తిడి ఎదుర్కొంటోంది. ఫర్టిలైజర్స్‌ షేర్లన్నీ లాభాల్లో ఉన్నాయి. రెండు శాతం నుంచి 5 శాతం వరకు లాభంతో ఉన్నాయి ఈ షేర్లు.