For Money

Business News

NIFTY LEVELS: 17056 కీలకం

నిఫ్టి క్రితం ముగింపు 17,123. ఇవాళ మార్కెట్‌ నష్టాలతో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో నిఫ్టి 17056 నిఫ్టికి కీలకం కానుంది. లాంగ్‌ పొజిషన్స్‌ ఉన్నవారికి ఇది స్టాప్‌లాస్‌ అని అనుకోవచ్చని డేటా అనలిస్ట్‌ వీరేందర్‌కుమార్‌ అంటున్నారు. ఈ స్థాయి దిగువకు వచ్చే వరకు నిఫ్టికి వచ్చిన నష్టం లేదని అంటున్నారు. ఈ స్థాయిని కోల్పోతే 16983 వద్ద తరువాతి మద్దతు ఉందిన ఆయన అంటున్నారు. అయితే 16901 దిగువకు వెళితే మాత్రం గట్టి ఒత్తిడి ఉంటుందని వీరేందర్‌ చెబుతున్నారు. ఇవాళ వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ ఉంది. దీంతో నిఫ్టిలో హెచ్చుతగ్గులకు ఛాన్స్‌ ఉంది. రిస్క్‌ తీసుకునేవారు 17056 స్టాప్‌లాస్‌తో పొజిషన్స్‌ కొనసాగించవచ్చు. కొత్తగా పొజిషన్‌ తీసుకోవాలంటే మాత్రం నిఫ్టి 17171 దాటిన తరవాత తీసుకోవాలని వీరేందర్‌ అంటున్నారు. నిఫ్టికి తొలి ప్రతిఘటన ఈ స్థాయి వద్దే ఎదురు కానుంది. ఈ స్థాయిని దాటితే నిఫ్టి 17196, ఆ తరవాత 17242 స్థాయిని తాకుతుందని ఆయన అంచనా వేస్తున్నారు.