For Money

Business News

భద్రావతి స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ… విరమణ

కర్ణాటకలో సెయిల్‌కు ఉన్న అనుబంధ సంస్థ భద్రావతి స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ యోచనను కేంద్ర విరమించుకుంది. ఈ ప్లాంట్‌ అమ్మేందుకు కేంద్రం బిడ్‌లను ఆహ్వానించింది. భద్రావతి వద్ద సెయిల్‌కు విశ్వేశ్వరాయ ఐరన్‌ అండ్‌ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలని 2016 జులైలో కేంద్రం నిర్ణయించింది. ఈ ప్లాంట్‌లో వంద శాతం వాటాను అమ్మాలని కేంద్రం నిర్ణయించింది. దీనికి సంబంధించి బిడ్‌లను 2019 జులైలో ఆహ్వానించింది. అయితే ఈ ప్లాంట్‌ కొనుగోలు చేయడానికి ప్రైవేట్‌ కంపెనీలు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో ఈ ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలన్న యోచనను విరమించుకుంది. బీపీసీఎల్‌లో 53 శాతం వాటా అమ్మాలని ప్రయత్నించిన కేంద్రం…ఆ ప్రతిపాదనను కూడా విరమించుకున్న విషయం తెలిసిందే.