For Money

Business News

కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు

కరోనా కొత్త వేరియంట్‌ వార్తలో స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ నిఫ్టి కన్నా అధికంగా ఏకంగా 250 పాయింట్లకు పైగా నష్టంతో నిఫ్టి ట్రేడవుతోంది. 17338 వద్ద ప్రారంభమైన నిఫ్టి వెంటనే 17279 పాయింట్లకు పడిపోయింది. ప్రస్తుతం 244 పాయింట్ల నష్టంతో 17290 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ కూడా 825 పాయింట్ల నష్టంతో 57,969 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టితో పాటు అన్ని సూచీలు భారీ నష్టాలతో ట్రేడవుతోంది. సిప్లా డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌, సన్‌ ఫార్మా మినహా అన్ని షేర్లు నష్టాల్లో ఉన్నాయి. భారీగా నష్టపోయిన షేర్లలో ఓఎన్‌జీసీ, టాటా మోటార్స్‌, కొటక్‌ బ్యాంక్‌,మారుతీ, కొటక్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌, టాటా స్టీల్‌, ఎస్‌బీఐ షేర్లు ఉన్నాయి. నిఫ్టితో పాటు బ్యాంక్‌ నిఫ్టి (2 శాతం) మిడ్‌ క్యాప్‌ సూచీ (1.5 శాతం) నిఫ్టి నెక్ట్స్‌ (1 శాతం) చొప్పున నష్టపోయాయి.