For Money

Business News

స్టాక్‌ మార్కెట్‌లో నష్టాల హోరు

ప్రపంచ మార్కెట్లన్నీ కొత్త వేరియంట్‌ వార్తలకు విలవిల్లాడి పోతున్నాయి. ఆల్‌ టైమ్‌ గరిష్ఠ స్థాయిల్లో ఉన్న మార్కెట్లు…. పతనానికి ఏదో సాకు కోసం ఎదురు చూస్తున్నాయి. కొత్త వేరియంట్‌ వార్తలకు వణికిపోయాయి. అన్ని ప్రధాన మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా దెబ్బకు వ్యాపారం బాగుంటుందని అనుకుంటున్న ఫార్మా షేర్లు తప్ప… మిగిలిన కౌంటర్లలో అమ్మకాలు హోరెత్తుతున్నాయి. ఉదయం 250 పాయింట్ల వద్ద నష్టాలతో కొద్ది సేపు సాగిన మార్కెట్‌లో.. క్రమంగా భయం ప్రవేశించింది. కొత్త వైరస్‌ వార్తలు దావానలంగా దేశ వ్యాప్తంగా వ్యాపించడంతో సాధారణ ఇన్వెస్టర్లు కూడా మార్కెట్‌ నుంచి బయటపడేందుకు ప్రయత్నించారు. దీంతో సెన్సెక్స్‌ దాదాపు 1500 పాయింట్లు క్షీణించగా, నిఫ్టి 450 పాయింట్లు పతనమైంది. ఏడు నెలల కనిష్ఠానికి సూచీలు పడిపోయాయి. ఆసియా మార్కెట్లలో అమ్మకాల హోరు జోరుగా ఉంది. జపాన్‌ నిక్కీ దాదాపు మూడు శాతం క్షీణించగా, హాంగ్‌సెంగ్‌ రెండున్నర శాతం వరకు నష్టంతో ఉంది. ఉదయం నామమాత్రపు నష్టంతో ఉన్న చైనా మార్కెట్లలో కూడా అమ్మకాలు పెరిగాయి. ప్రతి ఒక్కరూ అమ్మమనే సలహా ఇస్తుండటంతో చిన్న ఇన్వెస్టర్లు షేర్లను ఉంచుకునేందుకు సాహసించడం లేదు.