For Money

Business News

భారీ నష్టాలతో ప్రారంభం కానున్న నిఫ్టి

కరోనా కొత్త వేరియంట్‌ దేశ స్టాక్‌ మార్కెట్లను కుదిపేస్తోంది. అత్యధికంగా దక్షిణాఫ్రికాలో కేవలం 77 కేసులు నమోదు అయ్యాయి. అయినా.. ఈ ఈ వైరస్‌లో మ్యూటేషన్స్‌ 30కిపైగా ఉన్నాయని…వందకు పైగా సీక్విన్స్‌లు ఉన్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇపుడు మార్కెట్‌లో ఉన్న వ్యాక్సిన్లు ఏ మాత్రం పనిచేయక పోవచ్చని భయపడుతున్నారు. దీంతో ప్రపంచ స్టాక్‌ మార్కెట్లలో భారీ అమ్మకాల ఒత్తిడి వస్తోంది. ఇపుడు తెరచి ఉన్న స్టాక్‌ మార్కెట్లన్నీ భారీ నష్టాల్లో ఉన్నాయి. మూసి వున్న అమెరికా, యూరప్‌ మార్కెట్లలో ఫ్యూచర్‌ సూచీలు కూడా భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. ఇక మన స్టాక్‌ మార్కెట్‌ విషయానికొస్తే ఇవాళ నిఫ్టి భారీ నష్టాలతో ప్రారంభం కావొచ్చు. సింగపూర్ నిఫ్టి ప్రస్తుతం 193 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. ఈ లెక్కన నిఫ్టి భారీ నష్టాలతో ప్రారంభం కానుంది.