For Money

Business News

అర గంటలో… అయిపోయింది…

ఉదయం నుంచి ఊరించి …. ఊరించి.. చివరి అరగంటలో ఊసూరోమనింపించింది నిఫ్టి. రాత్రి అమెరికా మార్కెట్ల భారీ లాభాలను చూసి ఐటీ షేర్లతో పాటు ఇతర ప్రధాన కౌంటర్లకు మద్దతు ఇచ్చిన ఇన్వెస్టర్లు … అమెరికా ఫ్యూచర్స్‌ అర శాతంపైగా నష్టపోవడంతో లాభాలు స్వీకరించారు. యూరో మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నా… మార్కెట్‌ పట్టించుకోలేదు. ఉదయం 17053 పాయింట్లకు పడిన నిఫ్టి మిడ్‌ సెషన్‌ తరవాత 17,377 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. 1.30 నుంచి బలహీనపడుతూ వచ్చింది. సరిగ్గా మూడు గంటలకు మొదలైన పతనం… జెట్‌ స్పీడుతో దిగువకు క్షీణించింది. పావు గంటలోనే అంతా అయిపోయింది. గరిష్ఠ స్థాయి నుంచి ఏకంగా 270 పాయింట్లు నష్టపోయి 17102 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 142 పాయింట్లు నష్టపోయింది. విదేశీ ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఎఫ్‌ఐఐలు అధిక వాటా ఉన్న షేర్లు భారీగా నష్టపోయాయి. యాక్సిస్‌ బ్యాంక్‌ ఏకంగా 6.5 శాతం క్షీణించగా, కోల్‌ ఇండియా నాలుగు శాతం దాకా నష్టపోయింది. నిఫ్టిలో 38 షేర్లు నష్టాల్లో ముగిసింది. ఇవాళ అత్యధిక నష్టాలు నిఫ్టి నెక్ట్స్‌లో నమోదు కావడం విశేషం.