For Money

Business News

లాభాల్లో కొనసాగుతున్న మార్కెట్లు

ఉదయం నుంచి నిఫ్టి స్థిరంగా ముందుకు సాగుతోంది. యూరో మార్కెట్లు కూడా ఒక శాతంపైగా లాభంతో ట్రేడ్‌ అవుతుండటంతో మిడ్‌ సెషన్లో 17377 స్థాయిని నిఫ్టి తాకింది. ఇపుడు 123 పాయింట్ల లాభంతో 17367 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. అలాగే సెన్సెక్స్‌ కూడా 424 పాయింట్ల లాభంతో ఉంది. రిలయన్స్‌ గ్రూప్‌నకు చెందిన టీవీ 18 బ్రాడ్‌కాస్ట్‌ షేర్‌ నాలుగు శాతంపైగా నష్టంతో ఉండగా, నెట్‌వర్క్‌ 18 షేర్‌ స్వల్ప నష్టంతో ఉంది. నిఫ్టి టాప్‌ గెయినర్స్‌లో టాప్‌లో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ కొనసాగుతోంది. టాప్‌ లూజర్స్‌లో యాక్సిస్‌ బ్యాంక్‌ ఉంటోంది. ఇవాళ హెచ్‌డీఎఫ్‌సీ ట్వీన్స్‌ కూడా లాభాల్లో ఉన్నాయి. నిఫ్టి ఫైనాన్షియల్‌ సూచీ ఒక శాతంపైగా లాభంతో ఉంది. ఇక అమెరికా ఫ్యూచర్స్‌ నష్టాల్లో ఉన్నాయి. నాస్‌డాక్‌ రెడ్‌లో ఉంది. మే నెల డెరివేటివ్స్‌ ఇవాళే ప్రారంభమయ్యాయి. ఈ లాభాలు కొనసాగుతాయా? చివర్లో లాభాల స్వీకరణ ఉంటుందా అన్నది చూడాలి.