For Money

Business News

ఎన్‌టీవీకి వాత పెట్టిన కేటీఆర్‌

వరుసగా రెండు వారాల నుంచి రోజూ.. నంబర్‌ వన్‌ న్యూస్‌ ఛానల్‌ ఎన్టీవీలో ఒకటే స్టోరీని పదే పదే ప్రసారం చేస్తోంది. అదేమిటంటే… హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ ఢమాల్‌ అని పడిపోయిదంటూ ప్రత్యేక కథనం. ప్రతి రోజూ వివిధ అంతర్జాతీయ సంస్థలు ఇచ్చే నివేదికలు అన్ని దినపత్రికల్లో వస్తున్నాయి. అమ్మకాల్లోనూ, కొత్త ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో హైదరాబాద్‌ దేశంలోని మెట్రో నగరాలను ఢీ కొడుతోంది. పెద్ద పెద్ద మార్కెట్లను సవాలు చేస్తోంది. ముఖ్యంగా కమర్షియల్‌ సెక్షన్‌లో ఇతర నగరాలకు చెమటలు పట్టిస్తోంది. కాని ఎన్టీవీలో వస్తున్న కథనం వేరేలా ఉంది. తరచి చూస్తూ… ఈ ప్రత్యేక ప్యాకేజీలో పరమార్థం వేరు. ఆ స్టోరీలో హెడ్ లైన్స్ ఒకలా ఉంటే… స్టోరీ ఇంకోలా ఉంది. రియల్‌ ఎస్టేట్‌ కుప్పకూలిపోతోందని పెద్ద హెడ్‌లైన్స్‌ వేసినా… స్టోరీలో చెప్పిందేమిటంటే… జనం ఫ్లాట్లు కొనడం బదులు భూములు కొనేందుకు ఇష్ట పడుతున్నారు. ముఖ్యంగా జీవో 111 రద్దు నేపథ్యంలో జనం ఖరీదైన ఫ్లాట్ల కన్నా స్థలం కొనేందుకు మక్కువ చూపుతున్నారని రాశారు. అందువల్ల ఫ్లాట్లు అమ్ముడుబోవడం లేదని ప్రసారం చేశారు. దీనికి ఆధారం వారి సొంత సర్వే. బహుశా రియల్‌ ఎస్టేట్‌ వెంచర్స్‌ (బిల్డర్స్‌ కాదు) ఒత్తిడి మేరకు ఈ స్టోరీ వేస్తున్నారేమో అన్న చర్చ ఆ రంగంలోనే గత వారం రోజులుగా సాగుతోంది. కాని… ఇవాళ హైదరాబాద్‌లో క్రెడాయ్‌ సంస్థ ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ పరోక్షంగా ఎన్‌టీవీ స్టోరీపై చాలా ఘాటుగా స్పందించారు. కొన్ని ఛానల్స్‌ ఇలాంటి కథనం వేస్తున్నారంటూ… హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌లో ఎలా రాణిస్తోందో… ఆయన వివరించారు. ఇదే సమావేశంలో ఒకవైపు జగన్‌ పాలనను ఎద్దేవా చేస్తూనే… మరోవైపు ఎన్‌టీవీకి కూడా చురక అంటించడం ఇపుడు మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇపుడు కేటీఆర్‌ మాట్లాడిన వీడియోను టీఆర్‌ఎస్‌ వర్గాలు వైరల్‌ చేస్తున్నాయి.