For Money

Business News

స్వల్పంగా పెరిగిన నికర లాభం

మార్చి నెలాఖరుతో ముగిసిన త్రైమాసికంలో విప్రో కంపెనీ రూ. 3087 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ ఆర్జించిన నికర లాభం రూ. 2972 కోట్లతో పోలిస్తే 4 శాతం పెరిగింది. కంపెనీ ఫలితాలు మార్కెట్‌ విశ్లేషకులు అంచనాలకు అనుగునంగా ఉన్నాయి. ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 28 శాతం పెరిగి రూ. 16245 కోట్ల నుంచి రూ. 20860 కోట్లకు చేరింది. ఐటీ విభాగం నుంచి ఆదాయం స్థిరంగా ఉంది. రానున్న త్రైమాసికంలో కంపెనీ టర్నోవర్‌, నికర లాభం స్వల్పంగా పెరుగుతాయని కంపెనీ పేర్కొంది. కంపెనీ ఆపరేటింగ్‌ మార్జిన్‌ 0.6 శాతం తగ్గి 17 శాతానికి చేరింది. అలాగే కంపెనీ వొదిలి వెళ్ళిపోతున్నవారి శాతం 23.8 శాతం. కంపెనీ వద్ద ఆపరేటింగ్‌ క్యాష్‌ ఫ్లో రూ.2330కోట్లు ఉన్నట్లు కంపెనీ పేర్కొంది.