For Money

Business News

కోలుకున్నా… నష్టాల్లోనే నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్లు స్తబ్దుగా సాగుతున్నాయి. రాత్రి అమెరికా మార్కెట్లు భారీ నష్టాలతో ముగిసినా.. ఉదయం నుంచి ఆసియా, యూరప్‌ మార్కెట్లు స్వల్పంగా స్పందించాయి. నిఫ్టి కూడా ఉదయం నుంచి నష్టాల్లోనే కొనసాగింది. ఒకదశలో 18577ని తాకినా మిడ్‌సెషన్‌కు ముందు 18654ని తాకిన…చివరిదాకా నష్టాల్లో కొనసాగింది. నష్టాలను బాగా తగ్గించుకున్న నిఫ్టి 18642 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 58 పాయింట్లు క్షీణించింది. యూరో మార్కెట్లన్నీ నష్టాల్లో ఉన్నా… అవి నామమాత్రంగా ఉండటంతో మన ఈక్విటీ మార్కెట్లు స్వల్ప నష్టాలతో సరిపెట్టుకున్నాయి. ఇవాళ కూడా నిఫ్టి 18550 స్థాయిని నిలబెట్టుకుంది. నిఫ్టిలో 30 షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఇతర సూచీల్లో నిఫ్టి బ్యాంక్‌ దాదాపు అర శాతం నష్టపోయింది. నిఫ్టి నెక్ట్స్‌ క్రితం ముగింపు వద్దే ముగిసింది. ఇక షేర్ల విషయానికొస్తే అదానీ ఎంటర్‌ప్రైజస్‌ ఇవాళ నిఫ్టిలో టాప్‌ గెయినర్‌గా నిలిచింది. బీపీసీఎల్‌, హిందాల్కో, టాటా స్టీల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ షేర్లు రెండు శాతంపైగా నష్టపోయాయి. నిఫ్టి నెక్ట్స్‌లో కూడా అదానీ షేర్లు ముందున్నాయి. అదానీ టోటల్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌, అంబుజా సిమెంట్‌ టాప్‌ గెయినర్స్‌లో ఉన్నాయి. చాలా మంది అనలిస్టులు ఫెడరల్‌ బ్యాంక్‌ను రెకమెండ్‌ చేశారు. కాని ఈ షేర్‌ ఇవాళ రెండు శాతం దాకా నష్టపోయింది. అలాగే ఇవాళ కొత్త ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయిని తాకుతుందని భావించిన ఎస్‌బీఐ కూడా 1.3 శాతం నష్టపోవడం విశేషం.