For Money

Business News

ఎన్‌డీటీవీ డౌన్‌… బజాజ్‌ కన్జూమర్‌ అప్

ఓపెన్‌ ఆఫర్‌ తరవాత కూడా ఎన్‌డీటీవీ షేర్‌లో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. నిన్న అయిదు శాతం లోయర్‌ సీలింగ్‌ వద్ద ముగిసిన ఎన్‌డీటీవీ షేర్‌ ఇవాళ మరో 5 శాతం క్షీణించింది. ఈ షేర్‌ ప్రస్తుతం రూ. 373.35 వద్ద ట్రేడవుతోంది. ఈ ధర వద్ద ఎన్‌ఎస్‌ఈలో లక్షా 24 షేర్లకు అమ్మకం దారులు ఉన్నారు. కొనేవారు లేరు. మరోవైపు బజాజ్‌ కన్జూమర్‌ షేర్‌ ఇవాళ 5 శాతం పెరిగి రూ. 184.65ని తాకింది. ప్రస్తుతం మూడు శాతం లాభంతో 181 వద్ద ట్రేడవుతోంది. ఈనెల 9వ తేదీన
బజాజ్‌ కన్జూమర్‌ బోర్డు భేటీ కానుంది. ఈ సమావేశంలో షేర్ల బైబ్యాక్‌ గురించి చర్చిస్తారు.