For Money

Business News

18,000 దిగువన క్లోజైన నిఫ్టి

ఉదయం ఆరంభంలోనే నష్టాల్లోకి జారుకున్న నిఫ్టి మిడ్‌ సెషన్‌లో గ్రీన్‌లోకి వచ్చింది. మార్నింగ్‌ సెషన్‌లో దిగువ స్థాయిలో నిఫ్టికి మద్దతు లభించింది. అయితే ఫార్మా, బ్యాంకింగ్‌ షేర్లలో వచ్చిన అమ్మకాల ఒత్తిడి కారణంగా నిఫ్టి భారీగా క్షీణించింది. ఒకదశలో 17,958 స్థాయికి పడిపోయింది. అంటే ఉదయం గరిష్ఠ స్థాయితో పోలిస్తే నిఫ్టి దాదాపు 170 పాయింట్లు క్షీణించింది. స్టాక్‌ మార్కెట్‌లో షేర్ల పెరుగుదల మరీ ఎక్కువగా ఉందన్న ఆర్బీఐ వ్యాఖ్యలకు కూడా మార్కెట్‌ స్పందించింది. బ్యాంక్‌ నిఫ్టి ఒక శాతంపైగా నష్టపోయింది. చివర్లో స్వల్పంగా కోలుకుని 110 పాయింట్ల నష్టంతో 17,999 పాయింట్ల వద్ద నిఫ్టి ముగిసింది. వాస్తవానికి నిఫ్టిని ఇవాళ ఆటో షేర్లు కాపాడాయి. ఆటో షేర్ల ఇండెక్స్‌ ఇవాళ 2 శాతంపైగా పెరిగింది. నిఫ్టి టాప్ గెయినర్స్‌లో టాప్‌ అయిదు షేర్లూ ఆటో రంగానికే చెందినవి కావడం విశేషం. మారుతీ రూ. 8,000 దాటింది. నిఫ్టిలో 37 షేర్లు నష్టాలతో ముగిశాయి. మార్కెట్‌ బలహీనంగా ఉన్నా మిడ్‌ క్యాప్‌, నిఫ్టి నెక్ట్స్‌ మాత్రం స్వల్ప నష్టాలతో ముగిశాయి.