For Money

Business News

కోలుకున్నా… నష్టాలు తప్పలేదు

తీవ్ర ఒడుదుడుకుల మధ్య నిఫ్టి ముగిసింది. ఉదయం నుంచి రెండు సార్లు లాభాల్లోకి వచ్చిన నిఫ్టి చివర్లో కోలుకున్నా 67 పాయింట్ల నష్టం తప్పలేదు. దిగువ స్థాయి నుంచి వంద పాయింట్లు కోలుకుని 15293 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 67 పాయింట్లు నష్టపోయింది. అంతర్జాతీయ మార్కెట్లు ముఖ్యంగా యూరప్‌ ఒకటిన్నర శాతం లాభంతో ఉన్నా… మన మార్కెట్లు నష్టాల్లో ముగియడం విశేషం. నిఫ్టి బ్యాంక్‌, నిఫ్టి ఫైనాన్షియల్స్‌ మినహా మిగిలిన ప్రధాన సూచీలు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టి 0.44 శాతం , నిఫ్టి మిడ్‌ క్యాప్‌ 0.75 శాతం నష్టపోగా, నిఫ్టి నెక్ట్స్‌ 1.66 శాతం నష్టపోయింది. బజాజ్‌ హెల్డింగ్స్‌, డిమార్ట్‌, పిడిలైట్‌, జూబ్లియంట్ ఫుడ్స్‌, గ్లాండ్‌ ఫార్మా భారీ నష్టాల్లో ముగియడమే దీనికి ప్రధాన కారణం. ఫార్మా షేర్లలో ఇవాళ భారీ ఒత్తిడి కన్పించింది. దివీస్‌ ఫార్మా, లారస్‌ ల్యాబ్‌, గ్లాండ్‌ ఫార్మా భారీ నష్టాలతో ముగిశాయి.