For Money

Business News

ముగింపు లాభాల్లో?

భారీ నష్టాల తరవాత నిఫ్టి కోలుకుంది. ఉదయం 15183 పాయింట్లకు క్షీణించిన నిఫ్టి… అక్కడి నుంచి క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఇపుడు 15311 పాయింట్లకు చేరింది. కోలుకున్నా ఇంకా 50 పాయింట్ల నష్టంతో ఉంది. మరోవైపు మిడ్‌ సెషన్‌లో ప్రారంభమైన యూరో మార్కెట్లు గ్రీన్‌లో ట్రేడవుతున్నాయి. లాభాలు దాదాపు ఒక శాతం దాకా ఉన్నాయి. దీంతో మన మార్కెట్లకు మద్దతు లభిస్తుందేమో చూడాలి. గత కొన్ని రోజులుగా భారీగా క్షీణించిన బాజాజ్‌ ట్విన్స్‌ వంటి షేర్లు ఇవాళ కోలుకున్నాయి.కాని ఐటీ షేర్లలో మాత్రం ఒత్తిడి కొనసాగుతోంది. అలాగే నిఫ్టిలో 37 షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టి నెక్ట్స్‌ ఒక శాతంపైగా నష్టంతో ఉండగా, నిఫ్టి బ్యాంక్‌ గ్రీన్‌లో ఉంది. నిఫ్టి మిడ్‌ క్యాప్‌ అర శాతం నష్టంతో ఉంది. పరిస్థితి చూస్తుంటే నిఫ్టి గ్రీన్‌లో ముగిసేలా కన్పిస్తోంది.