For Money

Business News

రిలయన్స్‌ చేతికి రేవ్లాన్‌?

తాజాగా అమెరికాకు చెందిన కాస్మోటిక్స్ సంస్థ రెవ్లాన్‌ను టేకోవర్‌ చేయాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నారు. నష్టాలపాలైన ఈ కంపెనీ మొన్ననే దివాళా పిటీషన్‌ దాఖలు చేసింది. ఈ కంపెనీని టేకోవ‌ర్ చేయ‌డానికి రిల‌య‌న్స్ పరిశీలిస్తోందని ఈటీ నౌ చానల్‌ పేర్కొంది. ముడి స‌రుకు ధ‌ర‌లు పెరిగిపోవ‌డంతోపాటు గ్లోబ‌ల్ స‌ప్లయ్ చైన్‌లో అంత‌రాయం, పేరుకుపోయి రుణాలు వంటి కారణాలతో రెవ్లాన్‌ ఈ వారం ప్రారంభంలో అమెరికాలో దివాళా పిటిష‌న్ దాఖ‌లు చేసింది. 90 ఏళ్ళ రెవ్లాన్‌ బ్రాండ్‌కు అమెరికాలో మంచి పేరుంది. రెవ్లాన్‌ టేకోవర్‌పై తాము రిలయన్స్‌ స్పందన కోసం ప్రయత్నించామని… కాని కంపెనీ నుంచి ఎలాంటి స్పందన లేదని ఈటీ నౌ పేర్కొంది. రిల‌య‌న్స్ టేకోవ‌ర్ చేస్తుంద‌న్న వార్తలు రావ‌డంతో అమెరికాలొ ప్రి మార్కెట్ ట్రేడ్‌లో రెవ్‌లాన్ షేర్‌ 20 శాతం పెరిగి 236 డాల‌ర్లకు చేరింది.