For Money

Business News

17800పైన ముగిసిన నిఫ్టి

కేవలం 11 సెషన్స్‌లో నిఫ్టి 1200 పాయింట్లు పెరగడం విశేషం. మిడ్‌సెషన్‌ వరకు స్థిరంగా ఉన్న మార్కెట్‌ యూరప్‌ మార్కెట్‌ లాభాలు, అమెరికా ఫ్యూచర్స్‌ లాభాలతో…మార్కెట్‌ అనూహ్యంగా పుంజుకుంది. ఉదయం ఒకదశలో నష్టాల్లోకి జారుకుని 17,593ని తాకిన నిఫ్టి క్లోజింగ్ ముందు ఇవాళ్టి గరిష్ఠ స్థాయి 17,827ని తాకింది. క్రితం ముగింపుతో పోలిస్తే 179 పాయింట్ల లాభంతో 17805 పాయింట్ల వద్ద ముగిసింది. లాంగ్‌ పొజిషన్స్‌ కంటిన్యూ చేసినవారికి మంచి లాభాలు దక్కాయి. అయితే ఈ స్థాయిలో నిఫ్టి ముందుకు సాగుతుందా అన్నది చూడాలి. ఎందుకంటే విదేశీ ఇన్వెస్టర్లు కాల్‌ ఆప్షన్స్‌ను భారీగా అమ్మినట్లు మార్కెట్ వర్గాలు అంటున్నాయి. అది నిజమే అన్నట్లు ఎపుడూ చాలా ఆకర్షణీయ లాభాలతో ఉండే మిడ్‌ క్యాప్‌ నిఫ్టి కేవలం అరశాతం లాభానికి పరిమితమైంది. ఇక నిఫ్టి తరవాత ఆ స్థాయి షేర్లు ఉండే నిఫ్టి నెక్ట్స్‌ సూచీ క్రితం ముగింపు వద్దే ముగిసింది. అంటే ట్రేడింగ్ యాక్టివిటీ పూర్తిగా నిఫ్టి షేర్లకే పరిమితమైందన్నమాట.