For Money

Business News

ఢిల్లీ వారాంతపు కర్ఫ్యూ

ఒక్కసారిగా ఢిల్లీలో కరోనా విజృంభిస్తోంది. వారం రోజుల్లోనే కరోనా కేసులు 11,000 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 350 మంది హాస్పిటల్‌లో చేరినట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీష్‌ శిశోడియా వెల్లడించారు. దీంతో వారాంతంలో అంటే శని, ఆదివారాల్లో కర్ఫ్యూ విధించాలని ఢిల్లీ డిజాస్టర్‌ మేనేజ్మెంట్‌ అథారిటీ నిర్ణయించింది. నిత్యావసర సర్వీసులు మినహా ఇతర ఏ సేవలను, వ్యాపారాలను అనుమతించరు. పూర్తి విధివిధానాలు త్వరలోనే ప్రకటించనుంది. బస్సులు, మెట్రోలు వంద శాతం కెపాసిటీతో పనిచేస్తున్నాయి. మాస్క్‌ లేకుండా ఎవరినీ అనుమతించడం లేదు. ప్రభుత్వ సిబ్బంది ఇంటి నుంచే పనిచేయాల్సి ఉంటుంది.ప్రైవేట్‌ కంపెనీలు కేవలం 50 శాతం మంది మాత్రమే ఆఫీసులో ఉండాలని, మిగిలినవారు ఇంటి నుంచే పనిచేయాలని DDMA ఆదేశించింది.