For Money

Business News

17200 పైన క్లోజైన నిఫ్టి

కేవలం రెండు షేర్లు మాత్రమే … అదీ స్వల్ప నష్టాలతో ముగిశాయి. 48 షేర్లు లాభాల్లో క్లోజయ్యాయి. బ్యాంక్‌ నిఫ్టి నుంచి పెద్దగా మద్దతు అందకున్నా… నిఫ్టి విజయవంతంగా 17200 స్థాయిని దాటి 17233 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే 147 పాయింట్లు పెరిగింది. నిఫ్టికి 17200పైన మంచి సపోర్ట్‌ లభించే అవకాశముంది. ఎల్లుండి డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ కాబట్టి ఇప్పటి నుంచి పొజిషన్స్‌లో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఎందుకంటే యూరో మార్కెట్‌లో లాభాలు కూడా పెద్దగా లేవు. అలాగే అమెరికా ఫ్యూచర్స్‌ మార్కెట్లు కూడా పెద్ద లాభాల్లో లేవు. అయినా మన మార్కెట్లు ముఖ్యంగా మిడ్‌ క్యాప్‌ షేర్లు 1.2 శాతం పెరగడానికి కారణంగా గురువారం దగ్గరపడటమే. పైగా ఈ నెలలో ఫార్వర్డ్‌ ట్రేడింగ్‌ అయిదు వారాలు సాగింది. రెండున్న గంటల సమయంలో షార్ట్‌ ట్రేడర్స్‌కు కొద్ది లాభాలు ఇచ్చినా… నిఫ్టి బలహీనంగా కన్పించలేదు. చాలా రోజుల తరవాత సన్‌ ఫార్మా మూడు శాతంపైగా లాభాల్లో ముగిసింది. కారణంగా ఏపీలో ప్లాంట్‌ పెట్టేందుకు ఆ కంపెనీ సిద్ధమౌతోంది.