For Money

Business News

కొత్త రేట్లు జులై 18 నుంచి

సవరించిన జీఎస్టీ రేట్లు జులై18వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. క్రిప్టో ఆస్తులపై జీఎస్టీ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోని జీఎస్టీ కౌన్సిల్‌ ఇప్పటికు నిత్యావసర వస్తువులతో పాటు మరికొన్ని ఆహార పదార్థాలకు ఉన్న మినహాయింపులను ఎత్తేసింది. ఇవన్నీ జులై 18వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. జూన్‌ 30తో రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం ఆగిపోనుంది. కొనసాగింపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అలాగే జీఎస్టీ రేట్లు హేతుబద్ధీకరణపై కూడా కౌన్సిల్‌ తన నిర్ణయాన్ని వాయిదా వేసింది. దీనికి సంబంధించిన కమిటీ కాలాన్ని రెండు నెలలు పొడిగించింది. ఆన్‌లైన్‌ గేమింగ్‌, రేసులు, క్యాసినోలపై 28 శాతం పన్ను వేయాలన్న ప్రతిపాదనను వాయిదా వేసింది. జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ కోసం ఇక విద్యుత్‌ బిల్లు తప్పనిసరి చేశారు.