For Money

Business News

రియల్‌ ఎస్టేట్‌: బంపర్‌ సేల్‌

ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో రియల్‌ ఎస్టేట్‌ జెట్‌ స్పీడులో దూసుకుపోయింది. హైదరాబాద్‌, ముంబై, చెన్నైతో సహా దేశంలోని ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు భారీగా పుంజుకున్నాయి. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో ఎనిమిది నగరాల్లో 74,330 ఇళ్లు అమ్ముడు పోయాయని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ ప్రాప్‌టైగర్‌ పేర్కొంది. గత ఏడాది ఇదే కాలంలో అమ్ముడైన 15,968తో పోలిస్తే ఇది నాలుగున్నర రెట్లు ఎక్కువ. అంతక్రితం త్రైమాసికంతో పోలిస్తే రెసిడెన్షియల్‌ ఇళ్ళ అమ్మకాలు 5 శాతం పెరిగాయి. గత మూడు నెలల్లో ఆర్‌బీఐ రెండు సార్లు కీలక రెపో రేట్లు పెంచినా.. రెసిడెన్షియల్‌ ఇళ్ళకు డిమాండ్‌ కొనసాగిందని ప్రాప్‌టైగర్‌ తెలిపింది. అలాగే ఇళ్ల ధరలు ఐదు నుంచి తొమ్మిది శాతం పెరిగినా… డిమాండ్‌ రావడం విశేషం. వడ్డీ రేట్లు పెరగడంతో పాటు ముడి పదార్థాల ధరలు కూడా పెరుగుతుండటంతో గృహ ప్రవేశానికి రెడీ ఉన్న ఇళ్లకు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారని, కాస్త ధర ఎక్కువైనా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రాప్‌టైగర్‌ తెలిపింది. ఇక ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో సుస్థిర వాణిజ్య రియల్టీలో హైదరాబాద్‌కు చోటు దక్కింది. మొత్తం 20 నగరాలతో మరో ప్రాపర్టీ కన్సల్టెంట్‌ సంస్త నైట్‌ఫ్రాంక్‌ రూపొందించిన ఈ జాబితాలో హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, ముంబై, ఢిల్లీలకూ చోటు దక్కింది. టాప్‌-20లో బెంగళూరుకు 14, ఢిల్లీకి 17, హైదరాబాద్‌కు 18, ముంబైకి 20వ స్థానం లభించాయి.