For Money

Business News

వీటి ధరలు పెరుగుతాయి..

ఇవాళ జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ పలు రకాల ఆహార పదార్థాలపై ఇప్పటి వరకు ఉన్న జీఎస్టీ మినహాయింపును ఎత్తేసింది. వీటిపై 5 శాతం వరకు జీస్టీ విధించింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ చిరు వ్యాపారస్తులను కూడా పన్ను పరిధిలోకి తెచ్చారన్నమాట.
కీలక నిర్ణయాలు
ఇప్పటి వరకు ప్యాకేజ్‌ చేసిన, బ్రాండ్‌లేని ఆహార వస్తువులపై జీఎస్టీ మినహాయింపు ఉండేది. దాన్ని ఇపుడు ఎత్తేశారు.
పెరుగు, లస్సీ, మజ్జిగపై 5 శాతం జీఎస్టీ
అటుకులు, మర్మరాలపైనా జీఎస్టీ మినహాయింపు ఎత్తివేత
పాపడ్, పన్నీర్‌, తేనె, ఆహారధాన్యాలు, పప్పు ధాన్యాలపై జీఎస్టీ మినహాయింపు ఎత్తివేత
అన్‌రోస్టెడ్‌ కాఫీ, బీన్స్‌, ప్రాసెస్‌ చేయని గ్రీన్‌టీపై 5 శాతం జీఎస్టీ
వరి, గోధమ తౌడుపై 5 శాతం జీఎస్టీ