For Money

Business News

ఇష్టమొచ్చిన రేటుకు అమ్ముకోండి

దేశంలో ఉత్పత్తి అయిన క్రూడ్‌ ఆయిల్‌పై తన నియంత్రణను ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఉత్పత్తి చేసిన క్రూడ్‌ ఆయిల్‌పై ఇక ప్రభుత్వానికి ఎలాంటి అజమాయిషీ ఉండదన్నమాట. ఆయా కంపెనీలు రిఫైనరీలకు తమకు ఇష్టమొచ్చిన రేటుకు అమ్ముకోవచ్చు. ప్రధాని మోడీ నేతృత్వంలో ఇవాళ సమావేశమైన కేంద్ర కేబినెట్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో ఓఎన్‌జీసీ, ఆయిల్‌ ఇండియాతో పాటు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, కెయిర్న్‌ ఇండియా వంటి కంపెనీలు తాము ఉత్పత్తి చేసిన క్రూడ్‌ ఆయిల్‌ను దేశీయ కంపెనీలకు తమకు ఇష్టమొచ్చిన రేట్లకు అమ్ముకోవచ్చు. అయితే ఎగుమతి చేయడానికి వీల్లేదు. ఇవాళ రూ. 2501కి పడిన రిలయన్స్ షేర్‌ క్లోజింగ్‌కల్లా రెండు శాతం లాభంతో రూ. 2576 వద్ద ముగిసింది.