For Money

Business News

లేబుల్‌ ఉంటే… తేనె, పన్నీర్‌, పెరుగుపైనా జీఎస్టీ

మీరు తినే పదార్థం ఏదైనా సరే.. దాని ప్యాకెట్‌పై లేబుల్‌ ఉంటే జీఎస్టీ చెల్లించాల్సిందే. అలాగే మీరు లూజ్‌ చెక్‌ తీసుకున్నా… చెక్‌ బుక్‌ తీసుకున్నా జీఎస్టీ కట్టాలి. ఇవాళ జరిగిన జీఎస్టీ కౌన్సల్‌ అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. లేబుల్‌ ఉన్న మాంసం, చేపలు, పెరుగు, పనీర్‌పై జీఎస్టీ కట్టాల్సి ఉంటుంది. అలాగే బియ్యం, గోధుమలు కూడా ప్యాక్‌ చేసి ఉంటే 5 శాతం జీఎస్టీ. వీటితో పాటు లేబుల్‌ ఉన్న తేనె, పప్పు ధాన్యాలు, గోధుమలు, గోధమ పిండి, బెల్లం, ఆయిల్ వస్తువులు, ఆర్గానిక్‌ ఎరువులపై కూడా జీఎస్టీ కట్టాల్సిందే. కొత్త రేట్లు జులై 16వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. ఇక ఆన్‌లైన్‌ గేమింగ్‌, క్యాసినో, రేసింగ్‌, లాటరీల పన్ను అంశంపై నిర్ణయాన్ని కౌన్సిల్‌ వాయిదా వేసింది. వీటిపై 28 శాతం పన్ను వేయాలన్న ప్రతిపాదనపై మరింతగా సంప్రదింపులు జరపాలని కౌన్సిల్‌ భావించింది. అలాగే జీఎస్టీ పరిహారంను జూన్‌ 30 తరవాత కూడా పొడిగించాలన్న అంశంపై కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సగానికి పైగా రాష్ట్రాలు పరిహారం మున్ముందు కూడా చెల్లించాలని వాదించాయి. తదుపరి జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం మధురైలో ఆగస్టు తొలి వారంలో జరుగనుంది.