For Money

Business News

చివర్లో మళ్ళీ ఒత్తిడి

యూరో మార్కెట్లు నష్టాల్లో ఉన్నా చివర్లో మన మార్కెట్‌ గ్రీన్‌లోకి వచ్చింది. ఇవాళ్టి కనిష్ఠ స్థాయి15687 నుంచి దాదాపు 180పాయింట్ల వరకు పెరిగి నిఫ్టి 2.30 గంటలకల్లా గ్రీన్‌లోకి వచ్చింది. 15861ని తాకింది. ఇక అక్కడి నుంచి క్షీణించి 15799 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే 51 పాయింట్ల నష్టంతో ముగిసింది. ఇవాళ బ్యాంక్‌ నిఫ్టి బాగా దెబ్బతీసింది. ఒక శాతంపైగా క్షీణించింది. అలాగే ఇతర సూచీలలో నిఫ్టి నెక్ట్స్‌ 0.7 శాతం నష్టపోయింది. చాలా రోజుల తరవాత హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఏకంగా 4.67 శాతం నష్టంతో ముగిసింది. ఇవాళ మార్కెట్‌కు రిలయన్స్‌ అండగా నిలిచింది. సూచీలు ఒక మోస్తరు నష్టాలతో ఉన్నా.. చాలా షేర్లు భారీ నష్టాలతో ముగిశాయి. గత రెండు రోజుల నుంచి భారీగా క్షీణించిన జొమాటొ ఇవాళ ఆరంభంలో గ్రీన్‌లో ఉన్నా… క్లోజింగ్‌ సమయానికి 5శాతంపైగా నష్టంతో క్లోజైంది. అలాగే జూబ్లియంట్‌ ఫుడ్‌ను చాలా మంది విశ్లేషకులు సెల్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఈ షేర్‌ కూడా 4 శాతంపైగా క్షీణించింది. ఏయూ బ్యాంక్‌కు కొన్ని రేటింగ్‌ సంస్థలు సెల్‌ సిగ్నల్‌ ఇచ్చాయి. దీంతో షేర్‌ 4.45 శాతం క్షీణించి రూ. 594కు పడిపోయింది.