For Money

Business News

స్థిరంగా సింగపూర్ నిఫ్టి

రాత్రి అమెరికా మార్కెట్లు స్థిరంగా ముగిశాయి. సూచీల్లో పెద్దగా మార్పు లేదు. డౌజోన్స్‌ 0.27 శాతం లాభంతో ముగియగా, మిగిలిన సూచీల్లో మార్పు లేదు. ఫ్యూచర్స్ కూడా రెడ్‌లో ఉన్నాయి. కాని నామమాత్రమే. ఇక ఆసియా మార్కెట్లలో మిశ్రమ ధోరణి వ్యక్తం అవుతోంది.చైనా మార్కెట్లు లాభాల్లో ఉండగా, ఇతర మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. చైనా మార్కెట్లు దాదాపు ఒక శాతం లాభంతో ట్రేడవగా.. ఇతర మార్కెట్లు భారీ నష్టాల్లో ఉన్నాయి. జపాన్‌ నిక్కీ ఒక శాతం నష్టపోగా, హాంగ్‌సెంగ్ 0.37 శాతం నష్టంతో ఉంది. కాని కోప్సి ఒక శాతం, తైవాన్‌ రెండు శాతం నష్టంతో ఉన్నాయి. ఇక మన మార్కెట్‌ విషయానికొస్తే సింగపూర్ నిఫ్టి 35 పాయింట్ల నష్టంతో ఉంది. సో.. నిఫ్టి స్థిరంగా ప్రారంభం కావొచ్చు.