For Money

Business News

నష్టాల్లో నాస్‌డాక్‌

శుక్రవారం నాలుగు శాతం దాకా పెరిగిన నాస్‌డాక్ ఇవళ ఒక శాతం వరకు నష్టంతో ట్రేడవుతోంది. బాండ్‌ ఈల్డ్స్‌ రెండు శాతంపైగా తగ్గడం, డాలర్‌ ఇండెక్స్‌ కూడా స్వల్పంగా తగ్గడంతో ఈక్విటీ మార్కెట్లపై పెద్ద ఒత్తిడి లేదనే చెప్పొచ్చు. అయితే ఇప్పటికే బేర్‌ ఫేజ్‌లోకి వెళ్ళిన సూచీలు దిగువ స్థాయి నుంచి కోలుకుంటాయా లేదా బేర్ ఫేజ్‌ను కొనసాగిస్తాయా అన్నది చూడాలి. డౌజోన్స్‌ ఇవాళ స్థిరంగా దాదాపు క్రితం ముగింపు వద్దే ట్రేడవుతోంది. ఎస్‌ అండ్ పీ 500 సూచీ అర శాతం నష్టంతో ట్రేడవుతోంది. టెక్‌ షేర్లలో ట్విటర్‌పై తీవ్ర ఒత్తిడి ఉంది. మరోవైపు యూరో మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. యూరో స్టాక్స్‌ 50 సూచీ అర శాతం నష్టంతో ముగిసింది. క్రూడ్‌ ఆయిల్ తగ్గేదే లేదంటోంది. బ్రెంట్ క్రూడ్‌ 113 డాలర్లు, WTI క్రూడ్‌ 110 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. ఇక బులియన్‌లో పెద్ద మార్పు లేదు. బంగారం ఔన్స్‌ ధర 1800 డాలర్ల వద్ద కదలాడుతోంది.